త్వరలోనే గేమింగ్ అండ్ కామిక్స్ పాలసీ

AP MINISTER LOKESH
AP MINISTER LOKESH

త్వరలోనే యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్ అండ్ కామిక్స్ పాలసీని తీసుకొస్తున్నామని మంత్రి నారా లోకేష్ అన్నారు. ఐటీ శాఖ అధికారులతో మంత్రి నారా లోకేష్ సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఇప్పటి వరకు రూ. 1765 కోట్ల పెట్టుబడులతో 22వేల ఉద్యోగాలు వచ్చాయన్నారు. రూ.10వేల కోట్ల పెట్టుబడితో 1.31 లక్షల ఉద్యోగాల కల్పనకు ఒప్పందాలు జరిగాయన్నారు.