త్రివిధ దళాధిపతులతో సమావేశo

Nirmala Seetha raman
Nirmala Seetha raman

రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్‌ నేడు త్రివిధ దళాధిపతులతో సమావేశమయ్యారు. రోజువారీ ఉదయపు సమావేశాల పేరిట రక్షణ మంత్రి నిర్వహిస్తున్న ఈ సమావేశానికి ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌ దళాల అధిపతులు హాజరయ్యారు. ప్రతిరోజూ త్రివిధ దళాల అధిపతులతో సమావేశాలు నిర్వహిస్తామని, రక్షణ కార్యదర్శితో ప్రత్యేకంగా సమావేశం నిర్వహిస్తామని తద్వారా త్వరితగతిన నిర్ణయాలు తీసుకోవడానికి ఆస్కారం ఉంటుందని రక్షణ మంత్రిత్వ శాఖ ఇప్పటికే ప్రకటించింది. అలాగే డిఫెన్స్‌ అక్విజిషన్‌ కౌన్సిల్‌ (డిఎసి)తో పదిహేను రోజులకు ఒకసారి సమావేశం కానున్నట్లు మంత్రిత్వ శాఖ పేర్కొంది.