తెలుగుతోనే వెలుగు

VENKAIAH
VENKAIAH

తెలుగుతోనే వెలుగు

ఉద్యోగానికి ముడిపెడితేనే తెలుగు భాషకు రక్ష: ఉపరాZపతి
మానవత్వ నామ సంవత్సరం శ్రీ విళంబి: గవర్నర్‌
రాజ్‌భవన్‌లో ఉగాది వేడుకలకు హాజరైన ముఖ్యమంత్రి కెసిఆర్‌

హైదరాబాద్‌: రాజ్‌భవన్‌లో శనివారం సాయంత్రం తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్‌ నరసింహన్‌ ఉగాది పండుగ వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలకు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, టిఆర్‌ఎస్‌ అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు, మంత్రులు, అధికారులు, పలువురు పరప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయు డు మాట్లాడుతూ దేశంలోని సంస్కతిని, సంప్ర దాయాలను విద్యార్థులకు తెలియజేయాలిస ఉందని, ఇవన్ని పాఠ్యాం శాలలో పొందు పరచాల్సి ఉందని తెలిపారు. ఇదే సమయంలో దేశంలోని ప్రాంతీయ భాషలను రక్షించుకోవాల్సి ఉందన్నారు.