తెలంగాణ రాష్ట్ర బ‌డ్జెట్ వివ‌రాలు..

eetela
eetela

హైద‌రాబాద్ః రూ.1,74,453.84 కోట్లతో తెలంగాణ రాష్ట్ర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ గురువారం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. రెవెన్యూ వ్యయం రూ.1,25,454.70 కోట్లు కాగా, రెవెన్యూ మిగులు రూ. 5,520.41 కోట్లుగా ఉంది. కేపిటల్‌ వ్యయం రూ.33,69.10 కోట్లుగా ఉంది. అలాగే పంట పెట్టుబడి పథకానికి రూ.12 వేల కోట్లు రైతు బీమా పథకానికి రూ.500 కోట్లు, వ్యవసాయ యాంత్రీకరణకు రూ.552 కోట్లు, బిందు సేద్యానికి రూ.127 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు 29,041.88 కోట్లు ఆశిస్తున్నామని మంత్రి ఈటెల పేర్కొన్నారు.
బడ్జెట్ కేటాయింపులు ఇవే:
పాలీహౌస్‌, గ్రీన్‌ హౌస్‌కు రూ.120 కోట్లు
వ్యవసాయం, మార్కెటింగ్‌కు రూ.15,780 కోట్లు
కోల్డ్‌స్టోరేజీ, లింకేజీలు రూ.132 కోట్లు
పౌరసరఫరాలశాఖకు రూ.2946 కోట్లు
సాగునీటి ప్రాజెక్ట్‌లకు రూ.25 వేల కోట్లు
పంచాయతీలకు రూ.1500 కోట్లు
మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు రూ. 1000 కోట్లు
ఫౌల్ట్రీ రంగానికి రూ.109 కోట్లు
ఆసరా పెన్షన్లకు రూ.5300 కోట్లు
కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాలకు రూ.1450 కోట్లు
ఆరోగ్యలక్ష్మి పథకానికి రూ.298 కోట్లు
మహిళాశిశు సంక్షేమానికి రూ.1799 కోట్లు
ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక ప్రగతి నిధికి రూ.9693 కోట్లు
ఎస్సీ అభివృద్ధి శాఖకు రూ.12709 కోట్లు
దళితులకు భూపంపిణీకి రూ.1469 కోట్లు
ఎస్టీల అభివృద్ధి శాఖకు రూ.8063 కోట్లు
వెనుకబడిన తరగతుల సంక్షేమానికి రూ.5920 కోట్లు
రజక ఫెడరేషన్కు రూ.200 కోట్లు
నాయిబ్రాహ్మణ ఫెడరేషన్‌కు రూ.250 కోట్లు
ఎంబీసీ కార్పొరేషన్‌కు రూ.1000 కోట్లు
మైనార్టీ సంక్షేమానికి రూ.2వేల కోట్లు
బ్రాహ్మణ సంక్షేమానికి రూ.100 కోట్లు
జర్నలిస్టుల సంక్షేమానికి రూ.75 కోట్లు
డబుల్‌ బెడ్రూం ఇళ్లకు రూ.2643 కోట్లు
అమ్మ ఒడి పథకానికి రూ.561 కోట్లు
వైద్య ఆరోగ్యశాఖకు రూ.7375 కోట్లు
పాఠశాల విద్యకు రూ.10,830 కోట్లు
ఉన్నత విద్యకు రూ.2448 కోట్లు
రెసిడెన్షియల్‌ విద్యాసంస్థలకు రూ.2823 కోట్లు
మిషన్‌ భగీరథకు రూ.1801 కోట్లు
పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖకు రూ.15,563 కోట్లు
రోడ్లు, రవాణా, భవణాలకు రూ.5,575 కోట్లు
విద్యుత్‌ రంగానికి రూ.5,650 కోట్లు
చేనేత, టెక్స్‌టైల్‌ రంగానికి: రూ.1200 కోట్లు
పరిశ్రమలు, వాణిజ్యశాఖకు రూ.1286 కోట్లు
ఐటీశాఖకు రూ.289 కోట్లు
పట్టణాభివృద్ధిశాఖకు రూ. 7251 కోట్లు
వరంగల్‌ నగర అభివృద్ధికి రూ. 300 కోట్లు
ఇతర కార్పొరేషన్ల అభివృద్ధికి రూ. 400 కోట్లు
సాంస్కృతికశాఖకు రూ. 58 కోట్లు
వేములవాడ దేవాయం అభివృద్ధికి రూ. 100 కోట్లు
భద్రాచలం ఆలయ అభివృద్ధికి రూ. 100 కోట్లు
బాసర ఆలయ అభివృద్ధికి రూ.50 కోట్లు
ధర్మపురి ఆలయ అభివృద్ధికి రూ. 50 కోట్లు
అర్చకుల జీతభత్యాలకు రూ. 72 కోట్లు
సీజీఎఫ్‌కు రూ. 50 కోట్లు
హోంశాఖకు రూ. 5790 కోట్లు