తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షం

Heavy Rain in HYD City
Heavy Rain in HYD City

తెలంగాణ  జిల్లాల్లో భారీ వర్షం

తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షం కురుస్తోంది. రాష్ట్రంలోని నల్గొండ, కరీంనగర్‌, మహబూబాబాబ్‌, వరంగల్‌, భూపాలపల్లి తదితర జిల్లాలలో భారీ వర్షం కురుస్తోంది. వర్షం కారణంగా రోడ్లు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. భారీ వర్షానికి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. సూర్యాపేట హుజూర్‌నగర్‌లో ఓ ఇంటిపై పిడుగుపడి సామాగ్రి దగ్ధమైంది. సిద్దిపేట హుస్నాబాద్‌లో పిడుగుపాటుకు గేదె మృతి చెందింది.