తెలంగాణలో హెచ్‌ఎస్‌ఐఎల్‌ రూ.160 కోట్ల పెట్టుబడి

HSIL
HSIL

హైదరాబాద్‌: హిందూస్థాన్‌శానిటరీవేర్‌ఇండస్ట్రీస్‌ తెలంగాణలో రూ.160 కోట్ల పెట్టుబడులు పెడుతున్నట్లు ప్రకటించింది. సంస్థకొత్తగా ట్రుఫ్లో హింద్‌వేర్‌ ఉత్పత్తులనుప్రారంభించింది. హింద్‌వేర్‌పైపులు వచ్చే ఐదేళ్లలో టాప్‌ నాలుగుబ్రాండ్లలో ఒకటిగా నిలుస్తుందని కంపెనీ ప్రకటించింది. తెలంగాణలోనిమెదక్‌ జిల్లాలో ఇస్నాపూర్‌లో ఉత్పత్తికేంద్రం ప్రారంభించింది. మెదక్‌ప్లాంట్‌ 30వేల మెట్రిక్‌టన్నుల ఉత్పత్తి సామర్ధ్యంతో ఉంది. 2020 నాటికి 60వేల మెట్రిక్‌ టన్నుల సామర్ధ్యానికిచేరుతుందని కంపెనీ విసిఎండి సందీప్‌ సోమాని వెల్లడించారు. సిపివిసి, యుపివిసి పైపుల ఉత్పత్తిలో కీలకంగా వృదిధని సాధిస్తుందని అన్నారు. సురక్షిత మంచినీటికోసం వినియోగించే అన్నిరకాల సిపివిసి,యుపివిసి పైపుల ఫిట్టింగ్‌లను ఉత్పత్తిచేస్తుందని అన్నారు. కంపెనీ అధ్యక్షుడు రాజేష్‌ పాజ్నూ మాట్లాడుతూ తెలంగాణలోని ఇస్నాపూర్‌లో ప్లాంట్‌ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. జపాన్‌కు చెందినసెకిసుయి కెమికల్‌ కంపెనీతో ఒప్పందంచేసుకున్నామని, ఆయన అన్నారు. దేశంలో పివిసి పైపులు ఫిట్టింగ్‌ల మార్కెట్‌ 2020 నాటికి 327 బిలియన్‌ డాలర్లకు చేరుతుందని అన్నారు. 160 కోట్ల సంఘటిత పెట్టుబడులతో హెచ్‌ఎస్‌ఐఎల్‌ పైపుల డివిజన్‌ప్రస్తుతం 200మంది సిబ్బందితోనడుస్తున్నదని అన్నారు. తెలంగాణలో మొదటిసారిగా యూనిట్‌ప్రారంభించి దక్షిణాదిమార్కెట్‌కు కీలకంగా మారగలమని కంపెనీ అధ్యక్షుడు వెల్లడించారు. గ్రీన్‌బిల్డింగ్‌ నిబంధనలను సైతం తమ ప్లాంట్‌ అమలుచేస్తోందని హెచ్‌ఎస్‌ఐఎల్‌ అధ్యక్షుడు తెలిపారు.