తెలంగాణలో స్వైన్ ఫ్లూ వణికిస్తోంది

 

Swine flu masks
Swine flu masks

తెలంగాణలో స్వైన్ ఫ్లూ వణికిస్తోంది. హైదరాబాద్‌లో స్వైన్ ఫ్లూ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. కొన్నాళ్లుగా జాడలేని వైరస్ మళ్లీ చురుగ్గా విస్తరించడంతో ప్రజల్లో ఆందోళన మొద‌లైంది. దీంతో దీంతో చాలామంది ఏ కాస్త జ్వరం, జలుబు వచ్చినా అవి స్వైన్ ఫ్లూ లక్షణాలేమోనని తీవ్రంగా ఆందోళన చెందుతూ, ఆసుపత్రులకు పరుగులు తీస్తున్నారు. చల్లటి వాతావరణంతో వైరస్ ప్రభలుతోంది. స్వైన్ ఫ్లూ సాధారణ స్ధాయిలోనే ఉందని డాక్టర్లు చెబుతున్నా.. కేసులు రోజురోజుకు తీవ్ర స్థాయిలో పెరుగుతుండ‌టం గ‌మ‌నార్హం.