తుపాకులు సరెండర్‌ చేయాల్సిందిగా నోటీసులు

surrending revalvers
TS Issued Notice about Surrending Revalvers in Nayeem Cases

 తుపాకులు సరెండర్‌ చేయాల్సిందిగా నోటీసులు

హైదరాబాద్‌: నయీం కేసును సిట్‌ దర్యాప్తును వేగవంగం చేసింది. ఈ కేసులో పలు సంచలన విషయాలు వెల్లడి అవుతున్నాయి. నయీంతో చేతులు కలిపి దందాలు నడిపి, అతనికి మద్దతుగా నిలిచిన రాజకీయ నేతలు, పోలీసుల తుపాకులను వెనక్కితీసుకునేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఇప్పటికే వారికి నోటీసులు జారీ చేసింది. సర్వీసు రివాల్వర్లు సరెండర్‌ చేయాల్సిందిగా నోటీసులు అందుకున్నవారిలో ఇద్దరు ఎఎస్పీలు, ముగ్గురు డిఎస్పీలు, మరో ముగ్గురు సిఐలు సహా 21 మంది పోలీసు అధికారులు ఉన్నట్టు తెలుస్తోంది.