తుది నిర్ణయం ఇపుడే రాదు?

Tamil Nadu
Tamil Nadu

తుది నిర్ణయం ఇపుడే రాదు?

చెన్నై: తమిళనాడు రాజకీయ సంక్షోభం ఇప్పట్లో సమసిపోయేలా లేదని అన్పిస్తోంది.. గవర్నర్‌ ఇటు శశికళతోనూ, అటు ఆపద్ధర్మ సిఎం పన్నీర్‌సెల్వంతోనూ భేటీ అయ్యారు.. అయితే ఇరు పక్షాల వాదనలూ విన్న తర్వాత గవర్నర్‌ విద్యాసాగర్‌రావు నిర్ణయం ఏంటనేది ఉత్కంఠ రేపుతోంది.. అయితే రాజ్యంగ నిపుణులతో చర్చ,. వారంరోజుల్లోగా జయలలిత ఆస్తుల కేసులో సుప్రీం తీర్పు వెలువడనున్న దృష్ట్యా గవర్నర్‌ అపుడే వెంటనే నిర్ణయం ప్రకటించే అవకాశం లేదని రాజకీయ పరిశీలకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.