తీవ్ర ఒత్తిడికి గురవుతున్న టెలికాం రంగం

telecom
telecom

న్యూఢిల్లీ: దేశీయ టెలికాం రంగం తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటోందని 2017-18 ఆర్థిక సర్వే విశ్లేషించింది. ముఖ్యంగా టెలికాంరంగంలోకి కొత్తగా ప్రవేశించిన రిలయన్స్‌ జియో మార్కెట్‌ సంక్షోభానికి కారణమైందని పేర్కొంద.ఇ ఇతర కారణాలతోపాటు టారిఫ్‌ వార్‌ టెలికాం సేవల సంస్థలను దెబ్బతీసిందని చెప్పడం విశేషం. ఈ నేపథ్యంలో ప్రభుత్వ కొత్త టెలికాం పాలసీ తీసుకొస్తోంది చెప్పింది. దీని రూపకల్పన ప్రక్రియ కొనసాగుతోందని తెలిపింది. 2018లో ప్రభుత్వం ఈ కొత్త విధానాన్ని విడుదల చేయనుందని సర్వే వెల్లడించింది. అలాగే రెగ్యులేటరీ, లైసెన్సింగ్‌ విధానాలు, కనెక్టివిటీ, సేవల నాణ్యత, వ్యాపార సరళీకరణ, 5జి సేవలు, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింక్స్‌ లాంటి కొత్త టెక్నాలజీపై ఈ కొత్త విధానం దృష్టిపెట్టాలని సర్వే సూచించింది భారీ అప్పులు, టారిఫ్‌ వార్‌, అసంబద్ధమైన స్పెక్ట్రం ఛార్జీలు టెల్కోలను దెబ్బతీశాయని వ్యాఖ్యానించింది. టెలికాం మార్కెట్‌లో తక్కువ ధరలతో ఎంట్రీ ఇచ్చిన రిలయన్స్‌ జియో మార్కెట్‌లో సంక్షోభం ఏర్పడిందనీ, దీని కారణంగా ఇతర కంపెనీల ఆదాయం పడిపోయిందని తెలిపింది. ఈ సంక్షోభం పెట్టుబడిదారులు, రుణదాతలు, భాగస్వాములతోపాటు ఈ టెలికాం కంపెనీల వెండార్స్‌ను తీవ్రంగా ప్రభావితం చేసిందని సర్వే పేర్కొంది. అయితే హేతుబద్ధమైన స్పెక్ట్రమ్‌వేలం, ఇతర ఖర్చుల హేతుబద్ధీకరణ ద్వారా దీన్ని నియంత్రించాలని సర్వే సిఫార్సు చేసింది.