తాజ్‌మహ‌ల్ చుట్టూ ‘నో పార్కింగ్‌’

TAJ MAHAL
TAJ MAHAL

అగ్రాః ప్రముఖ చారిత్రక కట్టడం తాజ్‌మ‌హ‌ల్ చుట్టూ ఉన్న పార్కింగ్‌ ప్రాంతాన్ని వెంటనే తొలగించాలంటూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇకపై తాజ్‌మహల్‌ చుట్టూ వాహనాలు నిలపడం కుదరదు. పార్కింగ్‌ కారణంగా పర్యావరణ కాలుష్యం ఏర్పడే ప్రమాదం ఉందని సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. చారిత్రక కట్టడాన్ని సంరక్షించేందుకే ఈ ఆదేశాలు జారీ చేస్తున్నట్లు సుప్రీం తెలిపింది.