తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంత వరకూ బలపరీక్షకు వీల్లేదు: మద్రాస్‌ హైకోర్టు

Madras-High-Court
Madras-High-Court

చెన్నై: మద్రాస్‌ హైకోర్టులో టీటీవీ దినకరన్‌ వర్గానికి చుక్కెదురైంది. బలపరీక్ష నిర్వహించాలంటూ దినకరన్‌ వర్గం మద్రాస్‌ హైకోర్టులో పిటిషన్‌ వేసింది. దీనిపై బుధవారం అత్యవసర విచారణ చేపట్టిన న్యాయస్థానం ఇరు వర్గాల వాదనను విన్న తర్వాత తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంత వరకూ బలపరీక్ష నిర్వహించేందుకు వీల్లేదని న్యాయమూర్తి దురైస్వామి ఉత్తర్వులు జారీ చేశారు. ఎమ్మెల్యేల అనర్హత కేసు విచారణ పూర్తయ్యేంత వరకు విశ్వాస పరీక్ష నిర్వహించడానికి వీల్లేదంటూ
న్యాయస్థానం స్పీకర్‌ను అదేశించింది. మరోవైపు 18మంది తిరుగుబాటు ఎమ్మెల్యేలపై విధించిన అనర్హత వేటుపై స్టే విధించలేమని, కేసు విచారణ పూర్తయ్యేంత వరకు కూడా 18 మంది అనర్హత ఎమ్మెల్యేల స్థానాల్లో ఎన్నికలు నిర్వహించేందుకు వీల్లేదని తెలుపుతూ తదుపరి విచారణను ఆక్టోబర్‌ 4కి వాయిదా వేసింది.