తగ్గుముఖం పట్టిన పెట్రోలు, డీజిల్‌ ధరలు

petrol, diesel
petrol, diesel

న్యూఢిల్లీ: కొత్త ఏడాదిలో ఇంధన ధరలు మరింత తగ్గాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గుతుండటంతో పెట్రోలు,డీజిల్‌ ధరలు తగ్గుముఖం పట్టాయి. దేశ రాజధాని ఢిల్లీలో లీటరు పెట్రోల్‌ ధర 19 పైసలు తగ్గి రూ. 68.65గా ఉంది. అలాగే ముంబైలో లీటరు పెట్రోలు ధర రూ.74.30, కోల్‌కత్తాలో రూ. 70.78, చెన్నైలో రూ.71.23, హైదరాబాద్‌లో రూ. 72.82 గా ఉంది.