ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ కెప్టెన్‌గా శ్రయాస్‌ అయ్యర్‌

shreyas iyer
shreyas iyer

న్యూఢిల్లీ: ఐపిఎల్‌లో ఆడిన 6 మ్యాచ్‌ల్లో ఒకే ఒక్క మ్యాచ్‌ గెలిచిన ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ టీం ఐపిఎల్‌ టేబుల్‌లో అట్టడుగున ఉంది. అందువలన ఢిల్లీ డేర్‌డెవిల్స్‌కు సారథ్యం వహించిన గౌతమ్‌ గంభీర్‌ కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. గంభీర్‌ స్థానంలో శ్రయాస్‌ అయ్యర్‌ను టీమ్‌ కెప్టెన్‌గా నియమించింది. కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌లో కెప్టెన్‌గా ,ప్లేయర్‌గా సక్సెసైన గంభీర్‌..అదే ఫామ్‌ను ఢిల్లీ టీంలో కొనసాగించలేకపోయాడు. కెప్టెన్‌గానే కాక బ్యాట్స్‌మెన్‌గా కూడా గంభీర్‌ విఫలమయ్యాడు.