ఢిల్లీలో మ‌ళ్లీ ప్రారంభం కానున్న స‌రి-బేసి విధానం!

odd-even system in delhi
odd-even system in delhi

ఢిల్లీ: ఢిల్లీ సహా జాతీయ రాజధాని ప్రాంతం (ఎన్సీఆర్)లో వాయు కాలుష్యం తీవ్రస్థాయికి చేరుకున్న నేపథ్యంలో కాలుష్యాన్ని నియంత్రించేందుకు ఢిల్లీలో మరోసారి సరి-బేసి విధానాన్ని అమలు చేయాలని భావిస్తున్నట్టు సీఎం కేజ్రివాల్ తెలిపారు. ఎయిర్ క్వాలిటీ మోనిటరింగ్ స్టేషన్‌ ప్రారంభోత్సవం సందర్భంగా కేజ్రివాల్ మాట్లాడుతూ.. ‘‘ కేవలం ఢిల్లీనే కాదు… గత నెలరోజులుగా మొత్తం ఉత్తర భారత దేశం ఓ గ్యాస్ చాంబర్‌లా తయారైంది.. కాలుష్యాన్ని దారికి తెచ్చేందుకు అవసరమైతే మళ్లీ సరి-బేసి విధానాన్ని అమలు చేస్తాం. దీనిపై నేడో రేపో నిర్ణయం తీసుకుంటాం..’’ అని పేర్కొన్నారు.గాలిలో పీఎం (పర్టిక్యులర్ మేటర్) స్థాయిలు పెరిగేందుకు స్థానిక కారణాలు మాత్రమే కారణం కాదన్నారు. ఈ సమస్యను ఎదుర్కునేందుకు ఢిల్లీ ప్రభుత్వం, ప్రజలు సిద్ధంగానే ఉన్నప్పటికీ.. పంటలు తగలపెట్టకుండా పరిష్కారం కనిపెట్టేవరకు కాలుష్యం తగ్గదన్నారు. రాజకీయాలు పక్కనబెట్టి దీనికి పరిష్కారం కనిపెట్టేందుకు పొరుగు రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వం కలిసిరావాలని పిలుపునిచ్చారు. ఢిల్లీలో కాలుష్యం తీవ్రస్థాయిలో పెరిగడంతో వ్యక్తిగత, రవాణా వాహనాలకు సరి- బేసి సంఖ్యల విధానం అమలు చేయాలని పర్యావరణ కాలుష్య నియంత్రణ మండలి ఢిల్లీ ప్రభుత్వాన్ని ఆదేశించిన సంగతి తెలిసిందే.