ఢిల్లీలో ఐదు గంటలు ట్రాఫిక్ జామ్

 

traffic jam
traffic jam

దేశ రాజధాని ఢిల్లీలో ఐదు గంటలుగా ట్రాఫిక్ జామ్ కావడంతో ప్రయాణికులు నరకం చూస్తున్నారు. కొత్త సంవత్సరం తొలిరోజునే ఢిల్లీలో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. కిలోమీటర్ దూరం ప్రయాణానికి రెండు గంటలు పడుతుందని వాహనదారులు వాపోతున్నారు. అంబులెన్సులు సైతం ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కుపోయాయి. ట్రాఫిక్ జామ్ కు గల కారణాలు మాత్రం తెలియరావడం లేదని వాహనదారులు చెబుతున్నారు. చలి కారణంగా న్యూ ఇయర్ వేడుకలు జరుపుకునేందుకు జనం కార్లతో రోడ్డుపైకెక్కారు. ట్రాఫిక్ జామ్ తో ఇబ్బందులెదుర్కొంటున్నారు.