ఢిల్లీని తాకిన హోదా సెగలు..

TDP MPs
TDP MPs

ఢిల్లీని తాకిన హోదా సెగలు..

వాయిదాల మధ్య హోరెత్తిన ఉభయసభలు
టిడిపి ఎంపీల ఆందోళన –
తోడైన తెలంగాణ, తమిళనాడు ఎంపీలు
వైఎస్సార్సీ మహాధర్నా, అరెస్టులు
ఢిల్లీ పోలీసు స్టేషన్‌లో మోడీ, బాబుపై కాంగ్రెస్‌ ఫిర్యాదు
ధర్నాలో పాల్గొన్న ఉభయకమ్యూనిస్టులు, హక్కుల సాధన కమిటీ

అమరావతి: సోమవారం నుంచి ఉభయసభల్లో ప్రారంభమైన రెండవ విడత బడ్జెట్‌ సమావేశాలు ప్రత్యేకహోదాకోసం,విభజన చట్టం హామీల అమలుపై టిడిపి,కాంగ్రెస్‌ ఏంపీలు చేపట్టిన నిరసనలతో పలుమార్లు సభలను వాయిదావేసిన నిరసనలు ఆగకపోవడంతో ఆసభలను మంగళవారంకు వాయిదావేశారు. టిడిపి ఎంపీలచే సభల వెలుపల, బయట చేపట్టిన నిరసనలకు తెలంగాణా,తమిళనాడు ఎఐడిఎంకే ఎంపీలు తోడుకావడంతో నిరసనలు హోరెత్తిపోయాయి. వైఎస్సార్సీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ శ్రేణులు ఢిల్లీ లోని పార్లమెంట్‌లో చేపట్టిన మహాధర్నా సందర్భంగా ఆందోళనకారులు మూకుమ్మడిగా కేంద్ర హోంమంత్రి రాజ్‌నాధ్‌సింగ్‌కు వినతిపత్రం ఇవ్వడానికి సంసద్‌మార్గంలో వెళుతుండగా వారినిక పోలీసులు అరెస్టుచేసి స్టేషన్‌కు తీసుకెళ్ళారు.వారి ధర్నాకు ప్రత్యేకహోదా సాధన కమిటి, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మధు తదితరులు సంఘీభావంగా ధర్నాలో పాల్గొన్నారు.

ఎపి కాంగ్రెస్‌ చీఫ్‌ ఎన్‌.రఘువీరా రెడ్డి ఎపి ప్రత్యేకహోదా కల్పించడంలోను,విభజన చట్టంహామీలను అమలు చేయడంలో ప్రధాని నరేంద్రమోదీ ఏపి సిఎం నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలను మోసగించారని పార్లమెంట్‌ స్ట్రీట్‌ పోలీస్టేషన్‌లో వారివురిపై ఫిర్యాదుచేశారు. వైఎస్సార్సీ ఎంపీలు,ఎమ్మెల్యేలు ప్రధానిమోదీని కలవడానికి అపాయింట్‌మెంట్‌ అడగ్గా వారికి అవకాశం లభించలేదని తెలిసింది. తాము మార్చి 21న కేంద్రంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టివచ్చేనెల 6న తమ ఎంపీలు రాజీనామా చేస్తామని ఎంపీ వి.విజయసాయిరెడ్డి ప్రకటించారు. వైఎస్సార్సీ ఎంపీలు ఉభయ సభల్లో బయట,వెలుపల కూడా నిరసనలు తెలియజేయడంతో పాటు ప్రత్యేకహోదా కోసం చేపట్టిన మహాధర్నా కార్యక్రమం హోరెత్తింది.వీరితో పాటు కాంగ్రెస్‌ ఎంపీ డాక్టర్‌ కెవిపి రామచంద్రరావు పాల్గొన్నారు.ఇక టిడిపి ఎంపీల విషయం కొస్తే వారిలో ఎంపి డాక్టర్‌ శివప్రసాద్‌ కృష్ణుని వేషదారణతో తన నిరసన వ్యక్తంచేశారు.