డిసెంబర్‌ 10న ప్రతిపక్ష కూటమి సమావేశం!

opposition meet
opposition meet

న్యూఢిల్లీ: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బిజెపిని ఎదుర్కొనేందుకు ప్రతిపక్ష కూటమిగా ఎస్‌పి, బిఎస్‌పి, కాంగ్రెస్‌, రాష్ట్రీయ లోక్‌ దళ్‌లు ఉత్తరప్రదేశ్‌లో ఏర్పడనున్నాయి. డిసెంబర్‌ 10న ప్రతిపక్ష పార్టీలు తలపెట్టిన సమావేశంలో ప్రధాన పార్టీకి వ్యతిరేకంగా ఉన్న బహుజన్‌ సమాజ్‌ పార్టీకూ హాజరుకానున్నదనుకుంటున్నారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌ మిత్రపక్ష సమావేశంలో సమాజ్‌వాది పార్టీ పాల్గొంటుందన్న విషయం స్పష్టమైంది. కీలకమైన అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు ఒకరోజు ముందుగా బిజెపికి వ్యతిరేకంగా ప్రతిపక్షం మరో అడుగు వేసేందుకు సమావేశమవుతున్నది. ఇదంతా కూడా బిజెపిని ఎన్నికల్లో ఎదుర్కొనేందుకు ప్రతిపక్షం పన్నుతున్న వ్యూహంలో భాగమే. ఈ సమావేశానికి బిఎస్‌పి నేత మాయావతి స్వయంగా హాజరుకానున్నారా లేక ఆమె అనుచరుడు సతీష్‌ చంద్ర మిశ్రా ప్రాతినిధ్యం వహించనున్నారా అన్న విషయం ఇంకా తేలలేదు. వారిని కలిసినపుడు సానుకూలంగానే స్పందించారని సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకుడు చెప్పారు. సమావేశం పార్లమెంట్‌ హౌస్‌ అనెక్స్‌లో జరుగనుంది. వారి పార్టీ సమావేశంలో ఉంటుందా అన్న ప్రశ్నకు మిశ్రా స్పందించలేదు. లోక్‌సభ ఎన్నికలనెదుర్కొనేందుకు కీలకంగా మారిన మహాగట్‌బంధన్‌ (మహాకూటమి)కి బిఎస్‌పి హాజరుకాకపోయినా విశేషం కాదని ప్రతిపక్ష నాయకులు అభిప్రాయం వ్యక్తం చేశారు. లోక్‌సభ ఎన్నికలకు బిజెపి ఎదుర్కొనేందుకు ప్రతిపక్ష కూటమిలో భాగంగా ఉన్న ఎస్‌పి, బిఎస్‌పి, కాంగ్రెస్‌, అజిత్‌ సింగ్‌ రాష్ట్రీ§్‌ు లోక్‌దళ్‌లు రాష్ట్రంలో దృఢసంకల్పంతో ఉంటాయా అన్న సందేహం వ్యక్తం చేస్తున్నారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో అధికార పార్టీ 73 సీట్లు గెలుచుకుంది. ఉత్తరప్రదేశ్‌లో తమకు అనుకూలంగా సీట్లు రావాలని కోరుకుంటున్నదే తప్ప బిఎస్‌పి ప్రతిపక్షంలో ఉండాలని కోరుకోవడం లేదని వారన్నారు. రాష్ట్రంలో పొత్తులో ఉన్నవారు అలా రావాలనుకోవడం సరైనది కాదని సీనియర్‌ ప్రతిపక్ష నాయకుడు అన్నారు. ద్రవిడ మున్నేట్ర కజగం ఎంకె.స్టాలిన్‌, తృణమూల్‌ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు మమతా బెనర్జీ, రాష్ట్రీయ జనతా దళ్‌ తేజస్వీ యాదవ్‌, తెలుగుదేశంపార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు, ఎన్‌ఎస్‌పి అధ్యక్షుడు శరద్‌ పవార్‌, జెడిఎస్‌ నాయకుడు, కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్‌డి. కుమారస్వామి, జాతీయ సమావేశ అధ్యక్షుడు ఫరూఖ్‌ అబ్దుల్లా, సిపిఐ (ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీలతో పాటు ఇతరులు కూడా ఈ సమావేశానికి హాజరవుతారు. సమావేశంలో యుపిఎ అధ్యక్షురాలు సోనియాగాంధీ కూడా పాల్గొంటారనుకుంటున్నారు. ఈ సమావేశం మొదటి షెడ్యూల్‌ను నవంబర్‌ 22న ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించారు. అదేరోజు సమాజ్‌వాది పార్టీ వ్యవస్థాపకుడి జన్మదినం ఉన్నందున సమావేశం వాయిదా పడింది. బిజెపి ప్రభుత్వంలో ఏజెన్సీలు పెట్టుబడులు దుర్వినియోగం చేశాయన్న ఆరోపణలతో వాణిజ్య సంస్థలు జనవరిలో దేశవ్యాప్తంగా రెండు రోజుల పాటు సమ్మె చేయాలని ప్రతిపాదించాయి. డిసెంబరు 10న పార్లమెంటు, బయట జరిగే ప్రతిపక్ష కూటమి సమావేశంలో ఈ విషయాన్ని కూడా చర్చించవచ్చునన్నారు. ఎన్‌ఫోర్స్‌మెంట్‌, అధికారులు, ఆదాయపన్ను శాఖ ఈ మధ్య ఆంధ్రప్రదేశ్‌లోని తెలుగుదేశం నాయకులపై దాడులు చేస్తున్నది. అదేరోజు రాజ్యసభ చైర్మన్‌ వెంకయ్యనాయుడు, స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌లు ఫ్లోర్‌లీడర్లతో సమావేశం జరుపనున్నారు.