ట్రాఫిక్‌ ఉల్లంఘనులపై కొరఢా

break the traffic rules

ట్రాఫిక్‌ ఉల్లంఘనులపై కొరఢా

24 రోజుల స్పెషల్‌ డ్రైవ్‌లో దొరికిపోయిన 2.18 లక్షల మంది వాహనదారులు

హైదరాబాద్‌: జంట నగరాల్లో ట్రాఫిక్‌ ఉల్లంఘనులపై ఆయా ప్రాంతాల ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులు, ట్విటర్‌, ఫేస్‌బుక్‌ ద్వారా వస్తున్న విజ్ఞప్తుల మేరకు స్పందించిన ట్రాఫిక్‌ పోలీసులు 24 రోజుల పాటు నగరంలోని అన్ని చోట్ల నిర్వహించిన స్పెషల్‌ డ్రైవ్‌లో రెండు లక్షల 18 వేల 650 మంది వాహనదారులు అడ్డంగా దొరికిపోయారు. వీరం దరిపై ట్రాఫిక్‌ నియమాల ప్రకారం కేసులు నమోదు చేసినట్లు సిటీ ట్రాఫిక్‌ చీఫ్‌ అనిల్‌ కుమార్‌ ఆదివారం మీడియాకు తెలిపారు.

నగరంలోని అన్ని ప్రాంతాల నుంచి ప్రజలు తాము ఎదుర్కొంటున్న ట్రాఫిక్‌ సమస్యలపై కొన్ని రోజులుగా ఫిర్యాదులు చేస్తున్నారు. ఇదే సమయంలో ఆ యా ప్రాంతాల ప్రజలు ఆటోలు, బస్సులు, అడ్డగోలుగా వాహనాలు నడిపే వారి నుంచి ఎదురవుతున్న సమస్యలపై ట్విటర్‌, ఫేస్‌బుక్‌ ద్వారాకూడా ట్రాఫిక్‌ పోలీసులకు ఫిర్యాదు చేయసాగారు. వీటిపై స్పందించిన సిటీ ట్రాఫిక్‌ చీఫ్‌ అనిల్‌కుమార్‌ నగరంలోని 25 ట్రాఫిక్‌ పోలీసు స్టేషన్ల పరిధుల్లో గత ఆగస్టు నెల 23వ తేదీ నుం చి స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించాలని ఆదేశించారు. ట్రాఫిక్‌ రద్దీ తక్కువగా వుండే సమయంలో, వాహనదారులకు ఎలాంటి ఇబ్బం దులు లేని సమయంలో ఈ స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వ హించారు. ఈ స్పెషల్‌ డ్రైవ్‌లో అనూహ్యంగా రెండు లక్షల 18వేల 650 మంది వాహనదారులు ట్రాఫిక్‌ నియమాలను ఉల్లంఘించి దొరికిపోయారు.

ఇందులో ఆ టోవాలాలతో పాటు ద్విచక్ర వాహన దారులు, కార్లు తదితర వాహనదారులు కూడా వున్నారు. సరుకులు రవాణా చేసే ఆటోలు, ఇతర వాహనాలు నిబంధనలకు విరు ద్దంగా ఎలాంటి పత్రాలు లేకుండా వెళ్లడం, అధిక లోడ్‌తో వెళ్లడం, సరైన నంబర్‌ ప్లేట్‌లు లేకుండా వెళ్లడం వంటివి వున్నాయి.

ఇక ద్విచక్రవాహనదారుల్లో చాలా మంది లైసెన్స్‌లేకుండా, హెల్మెట్‌లేకుండా, నంబర్‌ ప్లేట్‌ లేకుండా వెళ్లడం వంటివి చేసి పట్టుబడ్డారు. ఇదే సమయంలో చాలావాహనాలు అడ్డగోలుగా రోడ్లపై నిలిచి వుంచడం, పార్కింగ్‌ కేంద్రాల వద్ద కాకుండారోడ్లపైనే వాహనాలుఆపి కబుర్లు చెబుతూ దొరికిపోయారు. పట్టుబడ్డ ట్రాఫిక్‌ ఉల్లంఘనులపై కేసులు నమోదు చేసిన ట్లు అనిల్‌ కుమార్‌ తెలిపారు. ఆయా ప్రాంతాల ప్రజలు ట్రాఫిక్‌కు సంబంధించి ఏదైనా సమస్యలు ఎదుర్కొంటే ధైర్యంగా ఫిర్యాదు చేయవచ్చని ఆయన తెలిపారు. ఈ ఫిర్యాదులపై వెంటనే చర్యలు తీసుకుంటామని ఆయన వివరించారు. జంట నగరాలలో రోడ్డు భద్రతను పటిష్టం చేసేందుకు తీసుకుంటున్న చర్యల్లో భాగంగా ఈ స్పెషల్‌ డ్రైవ్‌ చేబట్టినట్లు అనిల్‌ కుమార్‌ తెలిపారు.