ట్రంప్‌ కాన్వాయికి తృటిలో తప్పిన ప్రమాదం!

Trump canvoy
Trump canvoy

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ కాన్వాయికి తృటిలో ప్రమాదం తప్పింది. అమెరికాలోని మిస్సోరి పర్యటన ముగించుకొని వస్తుండగా హఠాత్తుగా చెట్ల పొదల్లోంచి వచ్చిన కారు ట్రంప్‌ కాన్వాయిని ఢీకొట్టబోయింది. ఆ కారులో ఇద్దరు అమ్మాయిలు ఉన్నట్లు భద్రతా సిబ్బంది గుర్తించారు. ఐతే కారు బ్రేకులు ఫెయిల్‌ అవడం వలన ఈ సంఘటన చోటుచేసుకుందని ప్రాథమిక విచారణలో తేలింది. ఘటనాస్థలిలో ఉన్న ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం కావాలనే ఆ కారు కాన్వాయి వైపు దూసుకువచ్చిందని చెబుతున్నారు. ప్రమాదం నుంచి బయటపడినందుకు సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు.