టీటీవీ దినకరణ్‌కు ‘ప్రెషర్‌ కుక్కర్‌’ గుర్తు కేటాయింపు

TTV Dinakaran
TTV Dinakaran

చెన్నై: అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత మరణం తరువాత పన్నీర్‌, పళని గ్రూప్‌లు ఒక్కటై శశికళ, అమె మేనల్లుడు దినకరణ్‌ను పార్టీని నుండి బహ్కిష్కరించారు. అనంతరం ఆర్కే నగర్‌కు జరిగిన ఉప ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన దినకరణ్‌ 40,707 ఓట్ల మెజారిటీతో ఘనవిజయం సాధించారు. అయితే ఇప్పుడు ఆర్కే నగర్ ఎమ్మెల్యే టీటీవీ దినకరణ్ కు చెందిన పార్టీ అమ్మ మక్కల్ మున్నేట్ర కజగం(ఏఎంఎంకే)కు కేంద్ర ఎన్నికల సంఘం గుర్తును కేటాయించింది. దినకరణ్ పార్టీకి ఖప్రెషర్ కుక్కర్గ గుర్తును కేటాయిస్తున్నట్లు తెలిపింది.