టి-20 ర్యాంకింగ్స్‌లో న్యూజిలాండ్‌దే అగ్రస్థానం

ICC
ICC

ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ కౌన్సిల్‌(ఐసిసి) ప్రకటించిన తాజా టీ-20 ర్యాంకింగ్స్‌లో న్యూజిలాండ్‌ తొలి స్థానంలో నిలవగా ,పాక్‌ ,భారత్‌లు రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. 126 పాయింట్లతో న్యూజిలాండ్‌ మొదటి స్థానం ఆక్రమించగా పాక్‌(124) ,భారత్‌(121), ఇంగ్లండ్‌(119), వెస్టిండీస్‌(115) టాప్‌ 5లో ఉన్నాయి. పాక్‌ జరిగిన టి-20 మ్యాచ్‌లో 47 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌ విజయం సాధించడంతో ర్యాంకింగ్స్‌ మారిపోయాయని ఐసిసి అధికారి ఒకరు తెలిపారు. పాక్‌ ఈ నెల 22, 25, 28న మూడు టి-20 మ్యాచ్‌లను ఆడనుండగా , ఈ మూడింటిలో కనీసం రెండింటిని గెలిస్తే, టాప్‌ ప్లేస్‌కు చేరుకుంటుంది.