టిఆర్ఎస్ రాజ్య‌స‌భ స‌భ్యుల ప్ర‌మాణ స్వీకారం

TRS RAJYA SABHA MEMBERS
TRS RAJYA SABHA MEMBERS

న్యూఢిల్లీః రాష్ట్రం నుంచి టీఆర్‌ఎస్ తరపున రాజ్యసభకు ఎన్నికైన ముగ్గురు సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్, బడుగుల లింగయ్య యాదవ్, బండా ప్రకాశ్ ముదిరాజ్‌లు రాజ్యసభ సభ్యులుగా ప్రమాణస్వీకారం చేశారు. ఆత్మసాక్షిగా వీరంతా ప్రమాణం చేశారు. సభ ప్రారంభమైన వెంటనే చైర్మన్ వెంకయ్యనాయుడు వీరి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం ఈ ముగ్గురు సభ్యులు.. వెంకయ్యనాయుడును కలిసి ధన్యవాదాలు తెలిపారు. వెంకయ్య కూడా వారికి శుభాకాంక్షలు తెలిపారు. జోగినపల్లి సంతోష్ కుమార్, బడుగుల లింగయ్య యాదవ్, బండా ప్రకాశ్ ముదిరాజ్‌లు తెలుగులోనే ప్రమాణస్వీకారం చేశారు.