టాస్ గెలిచి బ్యాటింగ్‌ను ఎంచుకున్న భార‌త్

third test match
third test match

న్యూఢిల్లీః నెంబర్ వన్ హోదాలో సిరీస్ ప్రారంభించిన టీమిండియా అద్భుత ఆట తీరుతో సిరీస్‌లో ఆధిక్యం సాధించింది. తొలి టెస్టులో గెలిచినంత పనిచేసి.. రెండో మ్యాచ్‌లో భారీ విజయాన్ని ఖాతాలో వేసుకున్న టీమిండియా.. శ్రీలంకతో టెస్టు సిరీస్‌కు ఫినిషింగ్‌ టచ్‌ ఇచ్చేందుకు సిద్ధమైంది. ఫిరోజ్‌ షా కోట్ల మైదానంలో జరుగుతున్న చివరి టెస్టులోనూ తన ఆధిపత్యాన్ని చూపించాలని కోరుకుంటోంది. అన్ని విభాగాల్లోనూ ఉన్న కోహ్లీసేన అదే జోరుతో మరో ఏకపక్ష విజయం సాధించాలన్న కృత నిశ్చయంతో ఉన్నది. మరోవైపు లంక మాత్రం చివరి మ్యాచ్‌లో నెగ్గి సిరీస్‌ను డ్రా చేసుకోవాలని భావిస్తోంది. ఈ పిచ్‌పై భారత్‌కు మెరుగైన రికార్డు ఉంది.
ఇదిలా ఉండగా, మూడు టెస్టుల సిరీస్‌లో భాగంగా ఫిరోజ్‌ షా కోట్ల మైదానంలో ప్రారంభమైన మూడో టెస్టులో భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో భారత్ రెండు మార్పులతో బరిలోకి దిగుతోంది. లోకేష్ రాహుల్, ఉమేష్ స్థానంలో ఓపెనర్ ధవన్, షమీ జట్టులోకొచ్చారు. శ్రీలంక మాత్రం ఈ మ్యాచ్‌ కోసం జట్టులో మూడు మార్పులు చేసింది. హెరాత్, తిరిమన్నె, షనక స్థానాల్లో సందకన్‌, ధనంజయ డిసిల్వ జట్టులోకి రాగా, రోషన్‌ సిల్వ టెస్టు ఆరంగేట్రం చేస్తున్నాడు.
జట్లు
భారత్‌: విజయ్‌, ధవన్‌, పుజారా, కోహ్లీ(కెప్టెన్‌), రహానె, రోహిత్‌, అశ్విన్‌, సాహా(కీపర్‌), జడేజా, ఇషాంత్‌, షమి‌.
శ్రీలంక: కరుణరత్నె, సమరవిక్రమ, ధనంజయ డిసిల్వ, మాథ్యూస్‌, చండీమాల్‌(కెప్టెన్‌), డిక్వెలా(కీపర్‌), రోషన్‌ సిల్వ, దిల్‌రువాన్‌ పెరీర, సందకన్‌, లక్మల్‌, గమగె.