జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌పై కేసిఆర్ ప్రశంస‌లు

pawan and kcr
pawan and kcr

హైద‌రాబాద్ః జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రశంసలు కురిపించారు. వపన్ కల్యాణ్ మన వ్యక్తే అని.. ఇకపై పవన్ ను బాగా చూసుకోండని టీఆర్ఎస్ శ్రేణులకు, కార్యకర్తలకు ఆయన సూచించారు. నిన్న ప్రగతి భవన్ కు వెళ్లిన పవన్ కల్యాణ్… కేసీఆర్ తో దాదాపు రెండు గంటల సేపు భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పవన్ ను డిన్నర్ చేయాలని కేసీఆర్ కోరినప్పటికీ, పవన్ వద్దన్నారు. భేటీ సమయంలో రాజకీయ అంశాలు, సమస్యలపై వీరిద్దరూ చర్చించారు. మరోవైపు, పవన్ ను బాగా చూసుకోవాలన్న కేసీఆర్ వ్యాఖ్యలు రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. పార్టీలకు అతీతంగా నేతలంతా దీనిపై చర్చించుకుంటున్నారు.