జూలై 30కల్లా పుష్కర పనులు పూర్తి

pff

జూలై 30కల్లా పుష్కర పనులు పూర్తి
గుంటూరు: జూలై 30వ తేదీలోగా కృష్ణాపుష్కరాలకు సంబంధించిన పనులన్నీ పూర్తిచేస్తామని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. మంగళవారం ఆయన తాడేపల్లి వద్ద పుష్కరఘాట్‌ను పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.కృష్ణాపుష్కరాలకు రూ.453 కోట్ల వ్యయంతో పనులు చేపట్టినట్టు తెలిపారు. అమరావతి వద్ద 1.3 కి.మీ. అతిపెద్ద పుష్కరఘాట్‌ను నిర్మిస్తామన్నారు. కాగా కృష్ణా నదిపై ఏడు పుష్కర ఘాట్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు.