జూన్‌ నాటికి సాగర్‌ ఆధునికీకరణ పనులు

 

harish rao
harish rao

సాగర్‌ ఆధునికీకరణ పనులు 2018 జూన్‌ నాటికి వంద శాతం పూర్తి చేస్తామని మంత్రి హరీశ్‌రావు అన్నారు. నాగార్జునసాగర్‌ నుంచి ఎడమ కాల్వకు నీటిని విడదల చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ హయాంలో సాగర్‌ ఆధునికీకరణ పనులు 30 శాతమే చేశారని, మేము మూడేళ్లలోనే 65 శాతం పనులు చేశామన్నారు. సాగర్‌ ఎడమ కాల్వ ఆధునికీకరణ కోసం రూ.1265 కోట్లు వెచ్చించామన్నారు. సాగర్‌ వద్ద లిఫ్ట్‌లన్నీ పూర్తిస్థాయిలో మరమ్మతులు చేసుకున్నామన్నారు. సాగునీటి విడుదల శాఖ అధికారులు అద్భుతంగా పని చేస్తున్నారన్నారు.