జిఎస్‌టి తర్వాత రాయితీలు కొనసాగుతాయా?

GST
GST

జిఎస్‌టి తర్వాత రాయితీలు కొనసాగుతాయా?

ముంబయి, జూన్‌ 25: జిఎస్‌టి అమలులోకి వచ్చిన తర్వాత కూడా ఎగుమతులకు నిర్దేశించిన ప్రోత్సా హకాలను కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణ యించింది. ఎగుమతిప్రయోజనాలను యధాతథం గా కొనసాగించాలని కేంద్రానికి ప్రతిపాదనలు అందాయి. ఎగుమతులకు సిద్ధంగా ఉన్న ఉత్ప త్తులపై కూడా ఈ ప్రయోజనాలు నిలిపివేయకూడ దని నిర్ణయించింది. దీనివల్ల భారత్‌కు విదేశీ కరెన్సీ రాక పెరుగుతుందని అంచనా. వాణిజ్య శాఖ కార్యదర్శి రీటా టియోతి యా మాట్లాడుతూ ఎగుమతు లకు సిద్ధంగా ఉన్న ఉత్పత్తు లపై ప్రయోజనాలు నిలిపివేస్తా మన్నారు. జిఎస్‌టి పరిధిలోని కే అన్ని కేటగిరీలు వచ్చిచేర తాయన్నారు. ఎగుమతి, దిగు మతిదారుల సమస్యలుపరిష్క రించేందుకు ప్రస్తుతం ఉన్న సెర్వర్లసామర్ధ్యం కూడా పెంచు తున్నట్లు ఆమె వివరించారు. ఇంజినీరింగ్‌,టెక్స్‌టైల్స్‌,ఫార్మా, రక్షణరంగం, సిల్క్‌ రంగాల్లోని వర్తకులు మొత్తం ప్రస్తుతం కొనసాగుతున్నస్కీంలు అన్నింటినీ యధా తథంగా కొనసాగించాలని కోరుతున్నారని ఆమె పేర్కొన్నారు.

పన్నుల చెల్లింపులకంటే వారు మిన హాయింపు రూట్లనే ఎంచుకుంటున్నారు. కొందరు పన్నులుచెల్లించి తిరిగి రీఫండ్‌ పొందగలుగుతున్నా రు. వీటన్నింటి దృష్ట్యా జిఎస్‌టి అమలు తర్వాత ఎగుమతి ఆర్డర్లు పొంది ఎగుమతులకు సిద్ధంగా ఉన్న కొన్ని కేటగిరీలు మినహా ఇతరత్రా అన్నింటి పైనా స్కీంలు కొనసాగించాలా లేదా అన్న అంశం పై ప్రభుత్వం పరిశీలన చేస్తోందని, త్వరలోనే ఒక నిర్ణయం వెలువడుతుందని రీటి టియోతియా పేర్కొన్నారు. భారత ఎగుమతిదారుల సంఘాల సమాఖ్య రీజినల్‌ ఛైర్మన్‌ డా.ఎ.శక్తివేల్‌ జిఎస్‌టి చెల్లించి రీఫండ్‌ పొందడం అనేది ఎగుమతిదారుల అధీకృత మూలధన వనరులను బ్లాక్‌చేస్తున్నట్లుగా ఉందని, ఇతరదేశాలతోపోలిస్తే ఇది ఎంతో ఖర్చుతో కూడుకున్న వ్యవహారమని అన్నారు. జిఎస్‌టిలో గార్మెంట్‌ ఉత్పత్తిదారులను ఐదుశాతం పన్నుశ్లాబ్‌ లో చేర్చకపోవడం వల్ల ఆరంగానికి భారీగా ఆర్ధ్థికభారం పెరుగుతుందని శక్తివేల్‌ పేర్కొన్నారు.