జిఎస్టీ కౌన్సిల్‌లో కీలక నిర్ణయాలు

Arunjaitlely-4
Arunjaitlely-4

జిఎస్టీ కౌన్సిల్‌లో కీలక నిర్ణయాలు

ఢిల్లీ: డిల్లీఈలో విజ్ఞాన్‌భవన్‌లో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ అధ్యక్షతన జిఎస్టీ కౌన్సిల్‌ 18వ సమావేశం జరిగింది.. ఈ భేటీకీ తెలంగాణ ఆర్థికమంంత్రి ఈటల రాజేందర్‌, ఎపి ఆర్థికమంత్రి యనమలతోపాటు ఇరు రాష్ట్రాల అధికారులు హాజరయ్యారు. జిఎస్టీ శ్లాబ్‌లపై వచ్చిన పలు విజ్ఞప్తులపై చర్చించిన కౌన్సిల్‌ ఎరువులు, ట్రాక్టర్ల విభాగాలపై పన్ను తగ్గింపునకు ఆమోదం తెలిపింది.. ఎరువులపై 12శాంతంగా ఉన్న శ్లాబ్‌ను 5శాతానికి తగ్గించింది.. అదేవిధంగా ట్రాక్టర్ల విడిభాగాలపై 28శాతంగా ఉన్న శ్లాబ్‌ను 18 శాతానిక తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు.