జపాన్‌లో పలు కంపెనీలతో ఒప్పందాలు

KTR in Japan Tour
KTR in Japan Tour

టోక్యో: తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్ ఇవాళ జపాన్‌లో పలు కంపెనీలతో  ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఫుడ్ ప్రాసెసింగ్, రినివబుల్ ఎనర్జీ అంశంలో జపాన్‌కు చెందిన ఐసీ ఫుడ్ సంస్థతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్నది. టోక్యోలో జరిగిన వివిధ సమావేశాల్లో మంత్రి కేటీఆర్ వివిధ కంపెనీల అధిపతులతో మాట్లాడారు.

వేస్ట్‌మేనేజ్‌మెంట్, స్మార్ట్‌సిటీ అంశాలపై తకుమా సంస్థతోనూ తెలంగాణ ఒప్పందం కుదుర్చుకున్నది. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ ఆ సంస్థ అధికారితో మాట్లాడారు. వేస్ట్‌మేనేజ్‌మెంట్, స్మార్ట్‌సిటీ అంశాలపై జేఎఫ్‌ఈ ఇంజినీరింగ్ సంస్థతోనూ ఒప్పందం జరిగింది. రెసిస్టార్లు ఉత్పత్తి చేసే ఎలక్ట్రానిక్స్ సంస్థతో కూడా ఇవాళ ఒప్పందం జరిగింది. మంగళవారం మంత్రి కేటీఆర్ సౌత్‌కొరియాలో పలు కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకున్న విషయం తెలిసిందే.