జపాన్‌తో మరింతగా వ్యాపార సహకారం

TS MINISTER KTR
TS MINISTER KTR

జపాన్‌తో మరింతగా వ్యాపార సహకారం

హైదరాబాద్‌: జపాన్‌, తెలంగాణల మద్య మరింత బలమైన ఆర్థిక, వ్యాపార భాగస్వామ్యాలను నెలకొల్పేం దుకు సహకారం అందించాలని జపాన్‌లో భారత రాయబారి సుజ న్‌ చినో§్‌ుని పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు కోరారు. బుధవారం జపాన్‌లో పరిశ్రమల శాఖ మంత్రి బృందం పర్యటిం చారు. మంగళవారం దక్షిణ కొరియా నుంచి జపాన్‌ చేరుకున్న బృందం జపాన్‌లోని టోక్యోలో పలు కంపెనీలతో సమావేశం అయ్యారు.

ముందుగా జపాన్‌లో భారత రాయబారి సుజన్‌ చినో §్‌ుతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా పెట్టుబడులు ఆక ర్షణే లక్ష్యంగా పర్యటన చేస్తున్నట్లు తెలిపారు. పెట్టుబడులతో పాటు పలురంగాల్లో జపాన్‌ సాధించిన సాంకేతిక ప్రగతి, ముఖ్యం గా పారిశ్రామిక రంగం, వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ వంటి రంగాల్లో జపా న్‌లో అనుసరిస్తున్న పద్దతులను ఆదర్శంగా తీసుకుంటామన్నారు. దీంతో పాటు జపాన్‌, తెలంగాణల మద్య మరింత బలమైన ఆర్థిక, వ్యాపార భాగస్వామ్యాలను నెలకొల్పేందుకు సహకారం అందించా లని రాయబారిని కోరారు.

ప్రధానంగా జపాన్‌ ఆర్థిక సంస్థలు(జైకా వంటివి) తెలంగాణాలోని పలు ప్రాజెక్టులకు ఇప్పటికే రుణ సహా యం అందించాయని, తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న మరిన్ని ప్రాజెక్టులకు ఈ ఆర్థిక భాగస్వామ్యాన్ని ఆశిస్తున్నట్లు, ఈ దిశగా రాష్ట్రానికి సహకారం కావాలన్నారు.