జనవరి 8,9 తేదిల్లో దేశవ్యాప్తంగా ఆర్టీసీ సమ్మె!

TS Buses
TS Buses

రాంనగర్‌: కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా కేంద్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు దేశవ్యాప్తంగా  సమ్మెలో పాల్గొంటామని తెలంగాణ ఆర్టీసీ ఐకాస నాయకులు సమ్మె నోటీసు ఇచ్చారు. సోమవారం ఐకాస నాయకులు హైదరాబాద్‌లోని బస్‌భవన్‌లో ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ రవీందర్‌ను కలిసి జనవరి 8, 9 తేదీల్లో సమ్మెలో పాల్గొననున్నట్లు నోటీసు అందజేశారు. ఈ సందర్భంగా ఐకాస ప్రధాన కార్యదర్శి కె.రాజిరెడ్డి మాట్లాడుతూ..కేంద్ర ప్రభుత్వం మోటారు వాహన చట్టం (ఎంవీ యాక్ట్‌) సవరణ బిల్లును తీసుకువచ్చి కార్మిక వర్గాన్ని అణచివేయటానికి ప్రయత్నిస్తోందన్నారు.పెట్రోల్‌, డీజిల్‌ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని డిమాండ్‌ చేశారు. రవాణారంగ కార్మికులకు జీతాలు తక్కువ ఉన్నందున కనీస వేతనం రూ.24 వేలు చేయాలని కోరారు. సంస్థ పరిరక్షణకు, కార్మికుల హక్కుల కోసం రెండు రోజుల సమ్మెలో పాల్గొనాలని ఆర్టీసీ కార్మికులకు ఆయన  పిలుపునిచ్చారు.