జగన్‌ త మరొసారి క్విడ్‌ ప్రోకో నాటకం

AP MINISTER LOKESH
AP MINISTER LOKESH

వైకాపా అధినేత జగన్‌ తనపై ఉన్న కేసుల మాఫీ కోసం మరొకసారి క్విడ్‌ ప్రోకో నాటకం ప్రారంభించారని మంత్రి నారా లోకేశ్‌ అన్నారు. ప్రత్యేక హోదా పేరుతో కేసుల మాఫీ కోసం వైకాపా నేతలు ప్రధాని కాళ్లమీద పడుతూ, పిఎంఒ చుట్టూ తిరుగుతున్నారని లోకేశ్‌ ట్వీట్‌ చేశారు. ఢిల్లి పెద్దల మెడలు వంచి ప్రత్యేక హోదా సాధించాలని ప్రజలు తమ రోషాన్ని ప్రదర్శిస్తున్నారని ఆయన అన్నారు. అయితే మోడీని నిలదీసే దమ్ము లేని జగన్‌ తన మోసపూరిత వైఖరిని మరొకసారి బైటపెట్టుకున్నారని ఆయన అన్నారు