జకీర్‌నాయిక్‌పై ఎన్‌ఐఎ నిఘా

jakirfff

జకీర్‌నాయిక్‌పై ఎన్‌ఐఎ నిఘా

న్యూఢిల్లీ: ఇస్లామిక్‌ రీసెర్చ్‌ ఫౌండేషన్‌ వ్యవస్థాపకుడు, ఇస్లాం మత బోధకుడు జకీర్‌ నాయిక్‌పై నేషనల్‌ ఇన్వేస్టిగేషన్‌ ఏజెన్సీ (ఎన్‌ఐఎ) నిఘా పెట్టింది. ఢాకాలోని హోలీ అర్టిసాన్‌ బేకరీపై దాడులు చేసిన అయిదురుగురు ఉగ్రవాదుల్లో ఒకరు జకీర్‌ నాయిక్‌ ప్రవచనాలను అనుసరిస్తున్నట్టు వెల్లడించటంతో నాయిక్‌పై నిఘా ఉంచారు. జకీర్‌ ప్రసంగాలను ఎన్‌ఐఎ అధికారులు విశ్లేషించటం ప్రారంభించారు. అతిజాగ్రత్తగా వ్యవహరించాలని స్పష్టపమైన ఆధారాలు సేకరించాలని ఎన్‌ఐఎ అధికారులు అదేశించినట్టు తెలిసింది.