ఛాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్లోకి భారత్‌

Team india-1
Team india

ఛాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్లోకి భారత్‌

ఐసిసి ఛాంపి యన్స్‌ ట్రోఫీలో ఎడ్జ్‌బాస్టన్‌ వేదికగా బంగ్లా దేశ్‌తో జరిగిన సెమీఫైనల్‌లో టీమిండియా విజయ దుందుభి మోగించింది. 9వికెట్ల తేడాతో భారీ విజయం సాధించింది. టాస్‌ గెలిచిన టీమిండియా బంగ్లాను బ్యాటింగ్‌కు ఆహ్వానిం చింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన బంగ్లాదేశ్‌ 50 ఓవర్లలో 7వికెట్లు కోల్పోయి 264పరుగులు సాధించింది. 265పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌ అద్భుతమైన బ్యాటింగ్‌ చేసింది. రోహిత్‌ శర్మ(123), సారథి విరాట్‌ కోహ్లీ(93) దాటిగా బ్యాటింగ్‌ చేసి నాటౌట్‌గా నిలవడంతో టీమిండియా 40.1ఓవర్లలో 265పరుగుల లక్ష్యాన్ని చేధించి పైనల్లోకి అడుగు పెట్టింది. ఫైనల్లో టీమిండియా దాయాది పాకిస్తాన్‌తో మరోమారు తలపడనుంది.

ఆసక్తికర మలుపులు తిరిగిన బంగ్లా ఇన్నింగ్స్‌

ఐసిసి ఛాంపియన్స్‌ ట్రోఫీ సెమీస్‌లో టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్‌ కోహ్లీసేనకు 265 పరుగుల లక్ష్యం నిర్ధేశించింది.సెమీఫైనల్లో టీమిండియా పేలవ ఫీల్డిండ్‌, బౌలింగ్‌తో ఎట్టకేలకు బంగ్లాదేశ్‌ను 264/7 కట్టడి చేసింది. ఒకానొక సమయంలో బంగ్లా 300పరుగులు చేస్తుందా అనిపించింది. కానీ, మధ్యలో బౌలర్లు పుంజుకోవడంతో స్కోరు కాస్త తగ్గింది. దీంతో 50ఓవర్లలో బంగ్లాదేశ్‌ 7వికెట్లకు 264పరుగులు చేసింది. ఓపెనర్‌ తమీమ్‌ ఇక్బాల్‌ 82బంతుల్లో 7ఫోర్లు, ఒక సిక్సర్‌తో 70పరుగులు చేసింది. ముష్పికర రహీమ్‌ 85బంతుల్లో 4ఫోర్లతో 61పరుగులు సాధించారు. చివరల్లో సారథి మొర్తజా 25బంతుల్లో 5ఫోర్లతో 30పరుగులతో మెరుగు బ్యాటింగ్‌ చేశాడు. బ్యాటింగ్‌కు స్వర్గధామంగా కనిపించి పిచ్‌పై బంగ్లా ఇన్నింగ్స్‌ పలు ఆసక్తికర మలుపులు తిరిగింది. సెమీస్‌లో బంగ్లాకు శుభారంభం లభించలేదు.

ఓపెనర్‌ సౌమ్య సర్కార్‌(0) జట్టు స్కోరు 1వద్ద భువి వేసిన ఇన్నింగ్స్‌ తొలి ఓవర్‌ చివరి బంతికి బౌల్డయ్యాడు. ఆ తర్వాత 30 పరుగుల వద్ద షబ్బీర్‌ రెహ్మాన్‌ (19) కూడా భువి బౌలింగ్‌లోనే వెనుదిరిగాడు. ఇక భారత్‌ ఆధిపత్యం సాగి స్తుందనుకున్నవేళ బంగ్లా అనూహ్యంగా పుంజు కొంది. ఓపెనర్‌ తమీమ్‌ ఇక్బాల్‌(70), ముష్పికర్‌ రహీమ్‌ (61) అద్భుతంగా పోరాడారు. భారత బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కొంటూ అర్ధశత కాలు సాధించారు. మూడో వికెట్‌కు 123 పరు గుల చక్కని భాగస్వామ్యం అందించారు. 21ఓవర్ల పాటు జట్టు స్కోరు 154 పరుగుల వద్ద కానీ, భారత్‌కు 3వ వికెట్‌ లభించలేదు. దీంతో కెప్టెన్‌ కోహ్లీ కేదార్‌ జాదవ్‌కు బంతి అందించాడు.

28ఓవర్‌లో అతడు తమీమ్‌ను పెవిలియన్‌కు పంపించాడు. ఆ తర్వాత షకిబ్‌(15), ముష్పికర్‌ రెండు పరుగుల తేడాతోనే వికెట్లు పారేసుకున్నారు. మ్యాచ్‌పై కోహ్లీసేన మళ్లీ ఆధిపత్యం సాగిస్తుందనుకొంటే చివర్లో కెప్టెన్‌ మొర్తజా 25బంతుల్లో 5ఫోర్లు చేసి 30పరుగులు, తస్కిన్‌ అహ్మద్‌ 14బంతుల్లో ఒక ఫోర్‌తో 11పరుగులు చేసి జట్టుస్కోరును 264కు చేర్చాడు. భువి, కేదార్‌, బుమ్రా తలో రెండు వికెట్లు తీశారు. దాటిగా చేధించిన టీమిండియా బ్యాట్స్‌మెన్లు 265పరుగుల విజయలక్ష్యంతో తర్వాత బ్యాటింగ్‌ ప్రారంభించిన భారత్‌ జట్టుకు శుభా రంభం లభించింది. ఆరంభం నుంచే ఓపెనర్లు రోహిత్‌ శర్మ (52), శిఖర్‌ దావన్‌ (46) వరుస బౌండరీలుబాదుతూ తొలి పవర్‌ప్లేతో దూకు డుగా ఆడారు.భారత ఓపెనర్లు వికెట్‌ ఇవ్వకుండా 63పరుగులు రాబట్టారు. ఈక్రమంలోనే అర్థ శతకానికి చేరువైన ధావన్‌ జట్టు స్కోరు 87వద్ద మొర్తజా బౌలింగ్‌లో పాయింట్‌ దిశగా షాట్‌ కొట్టేందుకు ప్రయత్నిస్తూ హుస్సేన్‌ చేతికి చిక్కాడు. అనంతరం రోహిత్‌ శర్మ 57బంతుల్లో అర్థశతకాన్ని పూర్తి చేసుకున్నాడు.

తర్వాత రోహిత్‌ కోహ్లీతో కలవడంతో వీరిద్దరూ బంగ్లా బౌలర్లపై విరుచుక పడ్డారు. తొలుత ఆచితూచి ఆడిన సారథి విరాట్‌ కోహ్లీ గేరుమార్చాడు. తన ట్రేడ్‌మార్క్‌ కళాత్మక డ్రైవ్‌లతో అలరించాడు. ఓపెనర్‌ రోహిత్‌ శర్మ కూడా దాటిగా బ్యాటింగ్‌ చేశాడు. రోహిత్‌ శర్మ 129బంతుల్లో 15ఫోర్లు, ఒక సిక్సర్‌తో 123 పరుగులు సాధించగా, టీమిండియా సారథి విరాట్‌ కోహ్లీ 78బంతుల్లో 13ఫోర్లతో 96 పరుగులు సాధించాడు. వీరిద్దరూ నాటాట్‌గా నిలిచారు. భారత్‌ 40.1ఓవర్లలో ఒకే ఒక వికెట్‌ కోల్పోయి 265 పరుగుల లక్ష్యాన్ని సాధించింది. బంగ్లా బౌలర్లలో మోర్తజా మాత్రమే ఒక వికెట్‌ సాధించాడు.