చైనా సూపర్‌ సిరీస్‌ విజేత సింధు

Sindhu
Sindhu

చైనా సూపర్‌ సిరీస్‌ విజేత సింధు

 

న్యూఢిల్లీ: ఒలింపిక్స్‌ రజత పతక విజేత సింధు మరో ఘనత సాధించింది.కాగా ప్రతిష్టాత్మక చైనా సూపర్‌ సిరీస్‌ ప్రీమియర్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీని సాధించి చరిత్ర సృష్టించింది. తుదిపోరులో తన కంటే ఒక ర్యాంకు మెరుగైన చైనా క్రీడాకారిణి సన్‌ యూపై 21-11, 17-21,21-11 తేడాతో సింధు సంచలన విజయం సాధించి టైటిల్‌ను ఎగురేసుకు పోయింది. కాగా తొలి రౌండ్‌ను సునాయాసంగా దక్కించుకున్న సింధు రెండవ రౌండ్‌లో గట్టి పోటీ ఎదుర్కొంది.దీంతో రెండవ రౌండ్‌ను 17-21తోకోల్పోయింది. నిర్ణయాత్మకమైన మూడవ రౌండ్‌లో సింధు పోరాట పటిమ ప్రద ర్శించింది. ఎదురుదాడి చేస్తూ చైనా క్రీడాకా రిణిని ఒత్తిడిలోకి నెట్టేసింది.కాగా ఈ క్రమంలో 21-11 తేడాతో మూడవ రౌండ్‌ గెలుచుకుని టైటిల్‌ చేజిక్కించుకుంది.సింధు కెరీర్‌లో ఇదే తొలి సూపర్‌ సిరీస్‌ కావడం విశేషం. సెమీఫైనల్‌లో సింధును ఆటను పరిశీలిస్తే సింధు తొలిసారి చైనా ప్రీమియర్‌ ఫైనల్‌కు చేరుకున్న సంగతి తెలిసిందే.బ్యాడ్మింటన్‌పై గుత్తాధిపత్యం ప్రదర్శించే చైనా క్రీడాకారిణు లను చిత్తు చేస్తూ ఆత్మ విశ్వాసంతో ఆడితే ఎవరైనా వారిని ఓడించగలరని నిరూపించారు సింధు. కాగా రియో ఒలింపిక్స్‌లో పతకంకోసం ఎదురూ చూసిన 120 కోట్ల మందికి తను సాధించిన పతకంతో ఆనందాన్ని కలిగించింది.ఫైనల్లో ప్రపంచ నంబర్‌ వన్‌,ఆటలో సాంకేతికంగా దూసుకుపోతున్న కరోలినా మారిన్‌(స్పెయిన్‌)ను మొక్కవోని స్థైర్యంతో ఎదుర్కొన్న క్షణాలను చూసి ప్రతి భారతీయుడు గర్వించాడు.ఒలింపిక్‌ పతకం గెలిచిన సింధు ప్రస్తుతం మరో ప్రతిషా త్మక పతకం కన్నేసిదాన్ని నిజం చేసుకునేందుకు ఒకే ఒక్క అడుగు దూరంలో నిలిచింది.ఒలింపిక్‌ పతకం పొందిన సింధు ఆ తరువాత పాల్గొన్న రెండు టోర్నీల్లో రెండో రౌండ్‌ దాటలేదు.కాగా ఈసారి మాత్రం ఆమె తనలోని అసలు సిసలు ఆటను బయటకు తీసింది.ప్రతిష్టాత్మక చైనా సూపర్‌ ప్రీమియర్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీ ఫైనల్‌ చేరుకుంది.కాగా శనివారం దక్షిణ కొరియా క్రీడారిణి సంగ్‌ య్యూన్‌తో జరిగిన సెమీ ఫైనల్‌లో హోరాహోరీగా పోరాడి 11-21, 23-21, 21-19తో విజయం సాధించింది. ఫైనల్లో తన కన్నా ఒక్క ర్యాంకు మెరుగైన చైనా క్రీడాకారణి సన్‌యూత్‌ తలపడనుంది.టైటిల్‌ గెలుచుకుంటే భారీస్థాయిలో ప్రైజ్‌మనీ ఉంటుంది. క్వార్టర్‌ ఫైనల్లో హీ బింగ్జీయావో(చైనా)ను 22-20,21-10తో చిత్తు చేసింది.సన్‌యూతో సింధు అయిదుసార్లు తలపడగా రెండు సార్లు సింధు,3 సార్లు ప్రత్యర్థి విజయం సాధించింది. సూపర్‌ సిరీస్‌ గెలువడం కల కెరీర్‌లో తొలిసారి చైనా సూపర్‌ సిరీస్‌ ప్రీమియర్‌ బ్యాడ్మింటన్‌ టైటిల్‌ కైవసం చేసుకున్న సింధు సంతోషం వ్యక్తం చేసింది.
కాగా సూపర్‌ సిరీస్‌ గెలువడం చాలా రోజుల నాటి కలగా వర్ణించింది.సన్‌ యూతో ఆదివారం జరిగిన హోరాహోరీ ఫైనల్లో సింధు తిరుగులేని విజయం సాధించింది.సూపర్‌ సిరీస్‌ గెలువడం చాలా రోజుల నాటి కల.ఒలింపిక్స్‌ తరువాత ఏంటని చాలా మంది ప్రశ్నించారు.సూపర్‌ సిరీస్‌ కైవసం చేసుకోవడం అత్యంత ముఖ్యం. ఒలింపిక్స్‌ తరువాత జీవితం మారిపోయింది. తిరిగి అదే స్పీడ్‌ అందుకోవడానికి చాలా కాలం పడుతుందని అనుకున్నాను,కానీ నేను చాలా కష్టపడ్డా,ఇది నా తొలి సూపర్‌ సిరీస్‌ టైటిల్‌. చాలా సంతోషంగా ఉంది అని వివరించడానికి మాటలు రావడం లేదు. ఇంతకు ముందు డెన్మార్క్‌ ఫైనల్‌ ఆడానని సింధు పేర్కొంది. టోర్నీలో ఫైనల్‌ గురించి సింధు మాట్లాడుతూ నేను బాగా ఆడా ఈ రోజు కలిసి వచ్చింది.కఠిన సాధన చేయడంతో బాగా ఆడుతానని అనుకున్నా,తొలి గేమ్‌ చాలా సులభంగా గెలిచారు.ఆమెతో రెండున్నర సంవత్సరాల తరువాత పోటీపడ్డాను. మేమిద్దరం దూకుడు కనబరిచే షట్లర్లం,రెండవ గేమ్‌ కోల్పోయా,మూడువ గేమ్‌లో 11-7 నుంచి ఆధిక్యం నిలబెట్టుకున్నానని సింధు వివరించింది.సైనా నెహ్వాల్‌,శ్రీకాంత్‌ 2014లో చైనా ఓపెన్‌ గెలిచారు.కాగా మాజీ ప్రపంచ నంబర్‌ వన్‌ను సమం చేసినందుకు చాలా సంతోషంగా ఉందని సింధు వెల్లడించింది. హోరాహోరీగా సాగిన చైనా ఓపెన్‌ సూపర్‌ సిరీస్‌ బ్యాడ్మింటన్‌ సింగిల్స్‌ ఫైనల్ల్‌ సింధు గెలుపొంది టైటిల్‌ చేజిక్కించుకోవడంపై ఆంధ్ర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హర్షం వ్యక్తం చేశారు. ఫైనల్లో సింధు పోరాట పటిమ భారతీయులకు సూర్తి అని కొనియా డాడు. యువతరానికి సింధు గర్వకారణంగా నిలి చిందన్నారు.కాగా తన ప్రదర్శనతో చైనా ఓపెన్‌ సిరీస్‌ టైటిల్‌ సాధించడం గర్వకారణమన్నాడు.