చెరకు మద్దతు ధర రూ.2,600

AP Minister Sujai Krishna
AP Minister Sujai Krishna

చెరకు మద్దతు ధర రూ.2,600

విజయవాడ: రానున్న క్రషింగ్‌ సీజన్‌లో టన్ను చెరకు మద్దతు ధర రూ.2,600లు పలకనుందని రాష్ట్ర మంత్రి సుజయకృష్ణ అన్నారు. కాగా ఈ రోజు విజయవాడ జిల్లా పరిధిలోగల జామి మండలం భీమసింగ్‌లో గల సహకార చక్కెర కర్మాగారం 42వ మహాజన సభ నిర్వహించారు. ఈ సభకు మంత్రి సుజయకృష్ణ, పలువురు ఎమ్మెల్యేలు, కలెక్టర్‌ వివేక్‌ యాదవ్‌ హాజరయ్యారు. మంత్రి సుజయకృష్ణ మాట్లాడుతూ.. భీమసింగ్‌ చక్కెర కర్మాగారం పరిధిలో రైతుల వడ్డీభారం తగ్గించేలా చర్యలు తీసుకుంటామన్నారు. నూతన పద్ధతులు అవలంభించేలా ఆలోచనలను పెంపొందించుకోవాలని మంత్రి సుజయకృష్ణ చెరకు రైతులకు సూచించారు.