చెడ్డీగ్యాంగ్ అరెస్టు

CHEDDI GANG
CHEDDI GANG

హైద‌రాబాద్ః ప్రజలను భయాందోళనకు గురిచేసిన చెడ్డీ గ్యాంగ్ సభ్యులను రాచకొండ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. గుజరాత్‌లోని దాహోద్ జిల్లా గర్బాద్ మండలం సహద గ్రామానికి చెందిన ఈ ముఠాలకు సంబంధించి కరుడుగట్టిన ముగ్గురు సభ్యులను అరెస్టు చేశారు. దీంతో 28 కేసుల మిస్టరీ వీడింది. గచ్చిబౌలిలోని రాచకొండ పోలీసు కార్యాలయంలో సీపీ మహేశ్ భగవత్ వివరాలు వెల్లడించారు. మీర్‌పేట్ పోలీసు స్టేషన్ పరిధి బీఎన్‌రెడ్డినగర్‌లోని శ్రీ సాయి బాలాజీ అపార్ట్‌మెంట్‌లో గత ఏడాది నవంబర్‌లో తాళం వేసి ఉన్న ఓ ఫ్లాట్‌లో చెడ్డీ గ్యాంగ్ చోరీ చేసింది. పట్టుకునేందుకు ప్రయత్నించిన వాచ్‌మెన్‌పై వారు రాళ్లతో దాడిచేసి పారిపోయారు. ఈ దొంగలను పట్టుకునేందుకు రాచకొండ పోలీసులు దాదాపు ఆరు నెలలకు పైగా సుదీర్ఘంగా ఆపరేషన్ దాహోద్ పేరుతో గాలించి పూర్తి సమాచారం సేకరించారు. వారి కోసం గుజరాత్‌కు వెళ్లారు. దినేశ్ అనే ముఠా సభ్యుడిని పట్టుకున్నారు. అతడు ఇచ్చిన సమాచారంతో గుజరాత్‌లోని దాహోద్ జిల్లా గర్బాద్ మండలం సహద గ్రామంలో వేట కొనసాగించినా దొంగల ఆచూకీ దొరకలేదు. వారికోసం ఎల్బీనగర్ ఎస్‌వోటీ ఇన్‌స్పెక్టర్ రవికుమార్‌తోపాటు మరో ఇద్దరు ఇన్‌స్పెక్టర్లు నిరంతరం నిఘాపెట్టారు. ఎప్పటికప్పుడు సమాచారాన్ని ఉన్నతాధికారులకు చేరవేశారు.