చంద్రబాబే నా రోల్‌మోడల్‌: కమల్‌

Kamal Hassan
Kamal Hassan

చెన్నై: ఏపి సియం నారా చంద్రబాబు నాయుడు తన హీరో అని విలక్షణ నటుడు కమల్‌హాసన్‌ తన రాజకీయ యాత్ర ప్రారంభించారు. తొలుత రామేశ్వరం చేరుకున్న ఆయన..అక్కడ మత్స్యకారులతో సమావేశమై వారి సమస్యలను విన్నారు. అనంతరం స్థానికంగా ఉన్న ఓ హోటల్‌లో మీడియాతో మాట్లాడారు. తాను మహాత్మాగాంధీకి వీరాభిమానినని చెప్పిన కమల్‌..ఏపి సియం చంద్రబాబు తన హీరో అని పేర్కొన్నారు. మంగళవారం రాత్రి చంద్రబాబు తనకు ఫోన్‌ చేశారని, ప్రజలకు ఏం చేయాలన్న విషయాలపై చర్చించాలని చెప్పారు. ఆయన విజన్‌ అద్భుతమని కొనియాడారు.