చంద్రబాబు దిగ్భ్రాంతి

AP CM
AP CM Chandra babu Naidu

చంద్రబాబు దిగ్భ్రాంతి

సచివాలయం: హిరాఖండ్‌ రైలు ప్రమాదంపై ఎపి సిఎం చంద్రబాబునాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.. ఘటనాస్థలిలో సహాయ చర్యల్లో పాల్గొనాలని పోలీసులను ఆదేశించారు.. గాయపడినవారికి మెరుగైన వైద్యం అందేలా చూడాలని కలెక్టర్లను ఆదేశించారు.. మృతదేహాలను స్వస్థలాలకు పంపేందుకు ఏర్పాటు చేయాలని సూచించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఉత్తరాంధ్రకు చెందిన మంత్రులు ప్రమాదస్థలానికి వెళ్లి సహాయ చర్యలు పర్యవేక్షించాలని ఆదేశించారు. విజయనగరం జిల్లాలో హిరాఖండ్‌ ఎక్స్‌ప్రెస్‌ పట్టాలు తప్పి 25 మంది మృతిచెందగా, 34 మందిగాయపడిన సంగతి విదితమే.