క్విన్సీ కెరీర్‌లో 28వ గ్రామీ

quincy jones
quincy jones

హైదరాబాద్‌: గ్రామీ చరిత్రలో అమెరికా మ్యూజిక్‌ డైరెక్టర్‌ క్విన్సీ జోన్స్‌ సరికొత్త అధ్యాయం సృష్టించాడు. తన కెరీర్‌లో అతను 28వ సారి గ్రామీ అవార్డును దక్కించుకున్నాడు. ఈ ఏడాది కూడా అతను బెస్ట్‌ మ్యూజిక్‌ ఫిల్మ్‌ క్యాటగిరిలో ఈ అవార్డును గెలుచుకున్నాడు. 70 ఏళ్ల కెరీర్‌లో అతను పది క్యాటగిరిల్లో గ్రామీ గెలిచాడు. క్విన్సీ గతంలో మైఖేల్‌ జాక్సన్‌తోనూ పనిచేశాడు.