కోస్తాను వణికిస్తున్న తుఫాను

Farmers near Tenali
Farmers near Tenali

కోస్తాను వణికిస్తున్న తుఫాను

మరో2 రోజుల వరకు తీరందాటని గండం
ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తం

అమరావతి: నిత్యం కారుమబ్బులు కమ్ముకుంటే ఏదొక ఉప్పెన తరహాలో తుఫాను రాష్ట్ర ప్రజలను రకరకాలపేరిట ఉధృతమై ప్రజలు కొలుకోలేనివిధంగా వెం టాడుతోంది. ప్రస్తుతం పెథా§్‌ుపేరిట తుఫాను ఉగ్రరూపం దాల్చి ఆంధ్రాకోస్తాజిల్లాలను అతలాకుతలం చేస్తూ ప్రజలను గజగజ వణికిస్తోంది. గడిచిన రెండు రోజుల నుంచి పెథా§్‌ు తుఫాను రూపాంతరం చెంది గంటకు 100 కిమీ వేగంతో గాలులు వీస్తుండడంతో గాలుల ప్రభావం వేగంతో ఘీంకరిస్తూ ప్రజలు తీవ్రభయభ్రాంతులకు గురిచేస్తున్నాయి.

ప్రస్తుతం తుఫాను ఒంగోలునుంచి కాకినాడ మధ్య తీరం దాటుతుందో.. మచిలీపట్నం నెల్లూరు మధ్య తీరం దాటుతుందో ఎవరికీ అంతుపట్టడం లేదు. సముద్రతీర ప్రాంతాల్లో సంబంధిత అధికారులు రెండవ ప్రమాద సూచికను ఎగురవేయడంలో ఆపరివాహక ప్రాంత ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.రెండురోజులుగా తుఫాను కారణంగా సముద్రం అలలు అల్లకల్లొలం గా మారి పెథా§్‌ు ఉదృతంతో అలలకు పరివాహన ప్రాంతాలన్ని ముంపుకు గురిఅవుతున్నాయి .

ముఖ్యంగా ప్రస్తుతం చేతికొచ్చే పంటలన్నీ నేల మట్టమయ్యాయి.అయితే సంబంధితజిల్లాల్లో జిల్లా కలెక్టర్లు,రెవెన్యూ యంత్రాంగం అప్రమత్తమై గత రెండు రోజులుగా సముద్రతీరప్రాంత ప్రజలను అప్రమత్తంచేస్తూ లోతట్టుప్రాంత ప్రజలకు తుఫాను ప్రభావం ఉన్న ప్రాంతాల్లో పునరావాస కేంద్రాలను ఏర్పాటుచేసి రెవెన్యూ అధికారుల నేతృత్వంలో శిబిరాలను ఏర్పాటుచేసి వారికి భోజన సౌకర్యాలు ఏర్పాటుచేశారు.తొలుత బంగాళాఖాతంలో వాయుగండంగానే భావించిన ప్రజలకు ఇది పెనుతుఫానుగా మారి మచిలీపట్నం కేంద్రానికి సుమారు 1100కిమీ దూరంలో కేంద్రీకృతమైంది. అయితే వాతావరణ పరిశోధనాధికారులు, శాస్త్రవేత్తలు వాయుగుండం పరిస్థితులను చూస్తుంటే ఒంగోలునుంచి కాకినాడ మద్య తీరం దాటే అవకాశులన్నాట్లు తెలిపారు.అయితే దక్షిణకోస్తాలో ఏప్రాంతంనుంచైనా తీరం దాటిన కృష్ణాజిల్లాపై ఈ ప్రభావం చూపుతుందని అధికారులు భావిస్తున్నారు.