కోనసీమ అందాలను ఆస్వాదిస్తోంది.

RAASI KHANNA
RAASI KHANNA

తొలి ప్రేమ హిట్ రాశీ కెరీర్ కు కూడా మంచి ప్లస్సయింది. దీని తరవాత తెలుగు – తమిళంలో ఆమె బాగా బిజీ అయిపోయింది. లేటెస్ట్ గా నితిన్ హీరోగా నటిస్తున్న శ్రీనివాస కళ్యాణంలో రాశీ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం అమలాపురంలో అవుతోంది. గోదావరి అందాలకు తోడు రాశి గ్లామర్ కలిసి చూడటమంటే ప్రేక్షకులకు కనువిందు అనే చెప్పాలి. నిన్న మొన్నటి వరకు సింగపూర్ లో ప్రెండ్స్ తో వెకేషన్ ఎంజాయ్ చేసిన ఈ బ్యూటీ ఇప్పుడు కోనసీమలో ప్రకృతి అందాలను ఆస్వాదిస్తోంది. దిల్ రాజు ప్రొడక్షన్ లో వస్తున్న శ్రీనివాస కళ్యాణం మూవీని సతీష్ వేగేశ్న డైరెక్ట్ చేస్తున్నాడు.