కేసిఆర్ కుటుంబం గుప్పిట్లో తెలంగాణః తారా ప్ర‌సాద్‌

BJYM
BJYM

అశ్వారావుపేటః నీళ్లు, నిధులు, నియామకాలు అన్న నినాదంతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం కేసీఆర్‌ కుటుంబం చేతిలో బందీగా మారిందని భారతీయ జనతా యువమోర్చా జిల్లా అధ్యక్షుడు భూక్యా తారా ప్రసాద్‌ విమర్శించారు. శుక్రవారం మండల యువమోర్చా కార్యవర్గ సమావేశం స్ధానిక సత్యసాయి కళ్యాణ మండపంలో సంఘం మండల అధ్యక్షుడు రావికింది కుమార్‌ రాజా అధ్యక్షతన జరిగింది. సమావేశంలో ప్రసాద్‌ మాట్లాడుతూ ప్రధాని మోదీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు రాష్ట్ర ప్రజలకు అందటంలేదని ఆవదేదన వ్యక్తంచేశారు. కేంద్ర పథకాలపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని ఆరోపించారు.