కేంద్రంలోని పాలకుల్లో అసహనం

AP CM BABU
AP CM BABU

అమరావతి: దేశంలో అశాంతి, అభద్రత నెలకొన్నాయని ,ప్రత్యర్ధులపై కక్ష సాధింపునకే ఐటి, ఈడీలను వాడుతున్నారని రాష్ట్ర సియం చంద్రబాబు అన్నారు. గరువారం గ్రామదర్శినిపై ఆయాశాఖల అధికారులతో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. కేంద్రంలోని పాలకుల్లో అసహనం పెరిగి, పెట్రోలు రేట్లు విపరీతంగా పెంచేశారని, నిత్యావసరాల ధరలు కూడా పెంచారని, సిబిఐ, ఆర్బీఐ స్వయం ప్రతిపత్తిని దెబ్బ తీశారని , ఈ పరిస్తితుల్లో దేశాన్ని రక్షించాల్సిన అవసరం ఉందని అన్నారు. తీత్లీ తుఫాను చర్యల్లో కేంద్రం నుంచి ఏ సాయం అందనప్పటికి మన వనరులతోనే బాధితులను ఆదుకున్నామని అన్నారు. నాలుగున్నరేళ్లలో ప్రగతి వివరాలను గోడరాతలతో అన్ని గ్రామాల్లో ప్రచారం చేయాలని , అభివృద్దిని ప్రజల కళ్లకు కట్టినట్లు కనబడాలని అధికారులకు సూచించారు.