కెప్టెన్‌గా తొలి విజయం

shreyas iyer
shreyas iyer

న్యూఢిల్లీ: కెప్టెన్‌గా బాధ్యతలు తొలి మ్యాచ్‌లోనే విజయం సాధించాడు ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ ఆటగాడు శ్రేయాస్‌ అయ్యర్‌. వరుస ఓటములకు బాధ్యత వహిస్తూ గౌతమ్‌ గంభీర్‌ కొద్ది రోజుల క్రితం కెప్టెన్సీకి గుడ్‌బై చెప్పిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో ఆ జట్టు యాజమాన్యం శ్రేయాస్‌ అయ్యర్క్‌ఉ నాయకత్వంలోని ఢిల్లీ జట్టు శుక్రవారం తొలి మ్యాచ్‌ ఆడింది. 55 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. “ఐపిఎల్‌లో మొదటసారి కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టా. అలా చేపట్టిన తొలి మ్యాచ్‌లోనే విజయం సాధించడం ఎంతో గొప్పగా ఉంది “అని శ్రేయాస్‌ అన్నారు.