కెకె అధ్యక్షతన టిఆర్‌ఎస్‌ ఎన్నికల మేనిఫెస్టో కమిటీ

K KESHAVA RAO
K KESHAVA RAO

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత, ఆపధర్మ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గురువారం మధ్యాహ్నం తెలంగాణ భవన్‌కు వచ్చి ఎన్నికల శంఖారావం పూరించడంతో పార్టీ తరఫున పోటీ చేసే 105 మంది అభ్యర్థుల జాబితాను కూడా విడుదల చేశారు. ఈ సందర్శంగా పార్టీ సెక్రటరీ జనరల్‌ కె.కేశవరావు అధ్యక్షతన ఎన్నికల మేనిఫెస్టో కమిటీని ప్రకటించారు. టిఆర్‌ఎస్‌ ఎన్నికల మేనిఫెస్టో కమిటీ చైర్మన్‌గా కె.కేశవరావు, సభ్యులుగా ఏపి జితేందర్‌రెడ్డి, జి.నగేష్‌, ఈటల రాజేందర్‌, టి.హరీష్‌రావు, జి.జగదీష్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, ఆజ్మీర చందులాల్‌, టి.పద్మారావు, కొప్పుల ఈశ్వర్‌, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఫరీదుద్దీన్‌, పి.రాములు, గుండు సుధారాని ఉన్నారు.