కూటమి గెలుపే…సోనియాకు బహుమతి

kushboo
kushboo

హైదరాబాద్‌: ఈ నెల 7న జరిగే ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్‌ను గెలిపించి..డిసెంబరు 9న సోనియాకు పుట్టినరోజు కానుకను అందజేయాలని కాంగ్రెస్‌ మహిళా నేత కుష్బూ ప్రజలకు పిలుపునిచ్చారు. ముషీరాబాద్‌లో ఎన్నికల ప్రచారానికి విచ్చేసిన కుష్బూ కూటమి అభ్యర్ధి అనిల్‌ కుమార్‌ యాదవ్‌కు మద్దతుగా మాట్లాడుతూ..కేసిఆర్‌ కుటుంబ పాలనకు చరమగీతం పాడాలని , ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేని కేసిఆర్‌కు వచ్చే ఎన్నికల్లో బుధ్ధి చెప్పాలని ఆమె అన్నారు. కేసిఆర్‌ గుర్తు అంబాసిడర్‌ కారు అని, ప్రస్తుతం ఆ కంపెనీ ఇప్పుడు మూతపడిందని, అలాగే కేసిఆర్‌ను కూడా తెలంగాణలో కనుమరుగు చేయాలని అన్నారు.