కుప్పం నుంచి లోకేష్‌!

LOKESH
LOKESH

కుప్పం నుంచి లోకేష్‌!
తిరుపతి బరిలో చంద్రబాబు?

రాజంపేట: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు వచ్చే ఎన్నికలకు తాను ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గం నుంచి తనయుడు లోకేష్‌ను బరిలోకి దింపాలని యోచిస్తున్నట్లు విశ్వశనీయ వర్గాల ద్వారా తెలిసింది. లోకేష్‌కు కుప్పం స్థానం సురక్షితమని బాబు యోచిస్తున్నట్లు సమా చారం అందుకే తాను పోటీ చేసే స్థానంపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుపతి నుంచి పోటీచేసే అంశంపై ఇంటిలిజెన్స్‌ వర్గాల ద్వారా ఇటీవలే సర్వే చేయించినట్లు తెలియవచ్చింది. ప్రధానంగా గత ఎన్నికల్లో రాష్ట్ర రాజధాని అమరావతిని దేశ రాజధాని ఢిల్లీని తలదన్నేలా నిర్మించే విషయమై ప్రధాని మోడీ తిరుపతి ఎన్నికల ప్రచారంలో కీలక ప్రకటన చేసిన విషయం తెలిసిందే. అయితే ఎన్నికల అనంతరం మట్టి తెచ్చి రాష్ట్ర రాజధానికి సహాయ నిరాకరణ చేస్తోన్న మోడీకి తిరుపతి నుంచే పోటీ చేయడం ద్వారా బీజేపీ చేసిన మోసాన్ని ఎండగట్టేందుకు అనుకూలమైన అంశంగా మారుతుందని బాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇంటిలిజెన్స్‌ వర్గాలు సర్వే అనంతరం సీఎంకు నివేదిక అందించినట్లు తెలిసింది. కాగా సీఎం తాను పోటీచేసే స్థానంపై మరొక ఆలోచన కూడా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. రాష్ట్ర రాజధాని అమరావతిలో నిర్మాణం పనులు ముమ్మరంగా జరుగుతున్న నేపథ్యంలో కోస్తా ప్రాంతం నుంచి పోటీ చేస్తే ఎలా ఉంటుందన్న అంశాన్ని కూడా చర్చించినట్లు సమాచారం. రాజధాని పరిసర జిల్లాల్లో పోటీ చేయడంద్వారా వచ్చే ఎన్నికల్లో స్థానికంగా సెంటి మెంట్‌ రగిల్చి మరోసారి తెలుగుదేశం పార్టీకి అవకాశం కల్పించాలని, తద్వారా ప్రపంచంలోని మేటి నగరాల్లో ఒకటిగా అమరావతిని తీర్చిదిద్దే బృహత్తర లక్ష్యానికి ప్రజల ఆశీర్వాదం కావాలని కోరే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. సీఎం పోటీ చేసే స్థానంపై సర్వే జరుగుతున్నట్లు ఆయన సన్నిహితుల ద్వారా తెలిసింది. ఒక దశలో అనంతపురం జిల్లాలో బాబు, లోకేషలలో ఎవరో ఒకరు బరిలోకి దిగేఅంశం కూడా పరిశీల నకు వచ్చినట్లు తెలిసింది. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కియో కార్ల పరిశ్రమ ఈ జిల్లాలో ఏర్పాటు చేసిన నేపథ్యంలో అక్కడ పోటీ చేయడంపై కూడా చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. అయితే పోటీ చేసే విషయంపై స్పష్టత రావాల్సి ఉందని ఆ వర్గాల ద్వారా తెలిసింది. ======