కావేరీ బోర్డు ఏర్పాటు చేయకపోతే సహాయ నిరాకరణోద్యమం

KAMAL HASSAN
KAMAL HASSAN

కావేరీ బోర్డు ఏర్పాటు చేయకపోతే సహాయ నిరాకరణోద్యమం చేస్తామని నటుడు, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ అధినేత  కమల్ హాసన్ అన్నారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ… తమిళనాడు నుంచి సహాయ నిరాకరణోద్యమం ప్రారంభమవుతుందన్నారు. కావేరీ నదీ యాజమాన్య బోర్డు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలన్నారు. కావేరీ బోర్డు ఏర్పాటు విషయంలో కేంద్రం వైఖరి సరిగా లేదన్నారు.